విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:
రాజమండ్రి పృథ్వీ టయోటలో టయోట అర్బన్ క్రూజర్ “టైజర్” వాహనాన్ని ఆవిష్కరణ
అధునాతనమైన మరియు భద్రత ప్రమాణాలు కలిగిన వాహనం
రాజమహేంద్రవరం,విశ్వం వాయిస్ న్యూస్:
టయోటా కిర్లోస్కర్ మోటార్స్ వాహనాల యొక్క అధీకృత డీలర్ అయిన పృథ్వీ టయోట తమ రాజమండ్రి షోరూమ్ నందు సరికొత్త టయోట అర్బన్ క్రూజర్ “టైజర్” వాహన శ్రేణిని ఈ రోజు ఆవిష్కరించడం జరిగింది.
ఇది శక్తి శీలమైన, అదనపు బలమైన మరియు సమగ్ర పరిధి కలిగినటువంటి స్పోర్ట్స్ యుటిలిటి
1.0L Turbo, 1.2L Dual Jet, Dual VVT petrol, E-CNG పాటుగా 5 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటో ట్రాన్స్మిషన్ కలిగి ఉంది. ఈ వాహనము నందు ప్రతిష్టాత్మకమైన మరియు ఎంతో సుందరమైన ఎక్సీరియర్ తో పాటుగా అంచనాలకు మించినటువంటి ఇంటీరియర్స్ ని కూడా కలిగి ఉన్నది. ఈ వాహనంలో వివిధ శ్రేణులలో 16″ ఎల్లాయిస్, ట్విన్ ఎస్ఈడీ డిఆర్ఎల్, డ్యూయల్ టోన్ ఎక్ట్స్రియర్, హెడ్ ఆఫ్ డిస్ప్లే, 9″ హెచ్ డి డిస్ప్లే, కాస్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, 6 ఎయిర్ బ్యాగ్స్ వంటి అధునాతనమైన మరియు భద్రత ప్రమాణాలు కలిగియున్నది. ఈ వాహనం యొక్క శ్రేణి రూ.7,73,500 నుండి ప్రారంభం అవుతున్నది. మైలేజ్ ప్రెట్రోల్ వేరియంట్ నందు 22.8 కిలోమీటరు,ఈ -సి ఎన్జి వేరియంట్ నందు 28.5 కిలోమీటరు/ కే జిగా షోరూం ప్రతినిధులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాజమండ్రి డి.టి.ఓ కె.ఎస్.ఏం.వి.కృష్ణారావు, టయోట ఏరియా మేనేజర్ శశికాంత్, పృథ్వీ మోటార్స్ ఎండి పృథ్వీచంద్ర ,సీఈవో కిరణ్ కుమార్ తో పాటు కంపెనీ సిబ్బంది మరియు ముఖ్య అతిథులు పాల్గొనడం జరిగింది.