Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అసత్యాలను సత్యాలు గా ప్రచారం చేయటం జనసేన పార్టీ కి తెలియదు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

అసత్యాలని సత్యాలు గా ప్రసారం చేయటం జనసేన పార్టీ కి తెలియదు
ప్రజలను మభ్య పెట్టి అసత్యలు ప్రసారం చేయటం మీకు మీ వైస్సార్సీపీ పార్టీ కి వెన్నతో పెట్టిన విద్య..
జనసేన పార్టీ నిజాలనే బయటపెడుతుంది – తోట స్వామి రావులపాలెం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు..

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, Ravulapalem:

నాలుగు రోజులు క్రితం రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామంలో జరిగిన సంఘటన అందరికి తెలిసిన విషయమే. దీని మీద అధికార పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ గోవిందా కృష్ణారెడ్డి మొన్న అదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి గ్రామంలో మేము ఎటువంటి జీవ హింసకి పాల్పడలేదు అని, కావాలని జనసేన పార్టీ వాళ్ళే ఫేక్ వీడియో, ఫోటోలు, కేసులుతో మా మీద ప్రచారం చేస్తున్నారు అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏది నిజం, ఏది అబద్ధం దీని మీద పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అని తెలియజేయడం కోసం ఈ రోజు జనసేన పార్టీ తరుపున మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం నుండి మీడియా ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలపడం జరుగుతుంది‌. ఏదైతే వైసిపి నాయకులు చెప్పారో మేము జీవ హింస చేయలేదు అని దాని ప్రతికూల వీడియోలు మా దగ్గర ఉన్నాయి మీ పంచాయతీ సిబ్బంది కుక్కలకు విషపూరిత ఇంజక్షన్లు ఇవ్వడం దగ్గర నుండి వాటి కళేబరాలు గోదావరి కలపడం వరకు, వాటిని తిరిగి బ్లూ క్రాస్ సిబ్బంది బయటకు తీయడం వరకు ప్రతి ఆధారం వీడియో రూపంలో మా వద్ద ఉంది. వాటినే ఈరోజు మీడియా ముందు ప్రదర్శించడం జరిగింది. ఇదే వీడియో ఆధారాలు బ్లూ క్రాస్ సంస్థకు, పోలీస్ శాఖకు కూడా అందజేయడం జరిగింది. వీడియో రూపంలో ఆధారాలు చూపించిన తరువాత ఎవరు అసత్య ప్రచారాలు చేస్తున్నారో.. ఎవరు నిజాలు చెప్పుతున్నారో ప్రజలకు తెలుస్తుంది. ఇంత గొడవకు కారణమైన వారి మీద గ్రామ పెద్దగా చర్యలు తీసుకోవడం మాని మా జనసేన పార్టీ వాళ్ళు మీద దాడి చేయించడం ఎంత వరకు సమంజసం మీరే చెప్పాలి. చట్టాలు తెలిసిన మీరు ఇలా ప్రవర్తించడం నిజంగా సిగ్గుచేటు.

ఇంకనైనా మా జనసేన పార్టీ వాళ్ళ మీద అసత్య ప్రచారం చేయడం మానుకోవాలి అని హెచ్చరిస్తున్నాను.

ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి బొక్కా ఆదినారాయణ, జనసేన నాయకులు దెయ్యం వినయ్ కుమార్, మండ్రేలా విజమ్, గుర్రాల సతీష్, గంధం సూరిబాబు, కొమ్ముల గణపతి, అంబటి కిషోర్, గాయత్రి ప్రసాద్, గీదా వెంకటష్, నంబు నాగు, గరికిపాటి తేజ, గంధం వెంకటేష్, మాదిరెడ్డి దుర్గా ప్రసాద్, పోలిశెట్టి శ్రీను, కొమరాజులంక జన సైనికులు పాల్గొన్నారు….

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement