ePaper
Sunday, August 16, 2026
ePaper
Homeతూర్పుగోదావరిప్రైవేటు పాఠశా లలకు దీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యం..

ప్రైవేటు పాఠశా లలకు దీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యం..

📰 Generate e-Paper Clip

రాయవరం, East Godavari (VISWAM VOICE DESK):

ఎంపీపీఎస్‌ నం.1 రాయవరం పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

 

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్:

 

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులకు దీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని ఎంపీపీఎస్‌ నం.1 రాయవరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. విజయకుమార్‌ తెలిపారు. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఎం. విజయకుమార్‌ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌ గంట భవాని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు దేశభక్తి నినాదాలతో స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆంగ్ల భాషలో చిన్నారి ప్రసంగించడంపై అంతా అభినందనలు కురిపించగా ప్రభుత్వ పాఠశాల అయినప్పటికీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని ఉపాధ్యాయులు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులకు కంప్యూటర్‌ విద్యను అందించేందుకు సొంత ఖర్చులతో కంప్యూటర్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసి, వారికి కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆధునిక విద్యకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్ది, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సైతం ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులతో పోటీపడే స్థాయికి ఎదిగేలా చేయడమే తమ లక్ష్యమని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయవరం గ్రామ మాజీ సర్పంచ్‌ చంద్రమళ్ల రామకృష్ణ, గ్రామ పెద్దలు కొండలరావు, నేతల సురేష్‌, గంటి చరణ్‌ తేజ, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది ఎం. మణి శృతి, చప్పల సుభాష్‌, టి. జయ, వరలక్ష్మి, పాఠశాల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img