Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 26, 2024 10:27 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 26, 2024 10:27 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 26, 2024 10:27 AM
Follow Us

క్యాన్సర్ బాధితురాలుకు ప్రభుత్వం సహాయం చేయాలి ,దాతలు ఆదుకోవాలి.

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ ప్రధాన కేంద్రం పి.గన్నవరం గ్రామం అంబేద్కర్ కాలనీ కి చెందిన మూడు సంవత్సరాల వయసు కలిగిన చుట్టుగుళ్ల సంగీత అనే బాలికకు క్యాన్సర్ వ్యాధి సోకి తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలి.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ ప్రధాన కేంద్రం పి.గన్నవరం గ్రామం అంబేద్కర్ కాలనీ కి చెందిన మూడు సంవత్సరాల వయసు కలిగిన చుట్టుగుళ్ల సంగీత అనే బాలికకు క్యాన్సర్ వ్యాధి సోకి తీవ్ర ఇబ్బందులకు గురవుచున్నది.సంగీత కుటుంబం పేద కుటుంబం, తల్లిదండ్రులు కూలి, నాలి చేసుకుని బ్రతికేవారు మెరుగైన వైద్యం చేయించుకోవడానికి లక్షల్లో ఖర్చు అవుతుంది .సంగీత కు మెరుగైన వైద్యం చేయించలేక ఆవేదన చెందుతున్న కుటుంబ సభ్యులను కలిసి ఈరోజు మదర్ తెరిసా సేవా సమితి ప్రతినిధుల బృందం ఓదార్పునిచ్చి, ధైర్యం చెప్పడం జరిగింది.మదర్ తెరిసా సేవా సమితి సభ్యుడు మాదిగ ఎన్నారైల కో-ఆర్డినేటర్ అంబాజీపేట మండలం కే.పెదపూడి కి చెందిన ఈతకోట నాగరాజు 5000 రూపాయల ఆర్థిక నగదు మరియు సేవా సంస్థ తరఫున పోషకాహార కిట్టును సమితి వ్యవస్థాపకులు Ln.ఉందుర్తి సుబ్బారావు చేతుల మీదుగా సంగీత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉందుర్తి సుబ్బారావు మాట్లాడుతూ అతి చిన్న వయసులో అత్యంత ప్రమాదకరమైన వ్యాధికి గురైన చిరంజీవి చుట్టుగుళ్ళ సంగీతను ప్రభుత్వం ఆదుకోవాలని అలాగే దాతలు స్పందించి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.స్థానిక ప్రజాప్రతినిధులు గౌరవ ఎమ్మెల్యే మరియు ఎంపీలు చుట్టుగూళ్ల సంగీతను పరామర్శించి సదరు మెడికల్ రిపోర్ట్స్ ను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి, ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అమ్మాయికి వైద్య ఖర్చుల నిమిత్తం నిధులు మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు.మెరుగైన వైద్యం జరిగే విధంగా గౌరవ ఉన్నత ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులు బాధ్యత తీసుకోవాలని సంగీతను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పి.గన్నవరం మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మల్లవరపు వెంకన్న మాదిగ,ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు తవిటికి వీర అభిమన్యుడు మాదిగ, మండల ప్రధాన కార్యదర్శి చింతపర్తి భీమన్న మాదిగ, మాదిగ సంఘం నాయకులు ఉందుర్తి ధర్మరాజు మాదిగ,చింతపర్తి నరసింహమూర్తి మాదిగ, మాదిగ యూత్ నాయకుడు చుట్టుగుళ్ళ రాంబాబు మాదిగ,మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉందుర్తి ప్రసాద్ రావు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement