Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,160,997
Total recovered
Updated on March 24, 2023 5:18 AM

ACTIVE

India
7,605
Total active cases
Updated on March 24, 2023 5:18 AM

DEATHS

India
530,816
Total deaths
Updated on March 24, 2023 5:18 AM

డిఫరెంట్‌ కధతో ‘పాప్‌ కార్న్‌’

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

‘ఆర్‌’కి అర్ధం ఏమిటన్నది సినిమాలోనే రివీల్‌ అవుతుందన్నారు. లిప్టులోనే నాలుగు పాటలు చిత్రీకరించామన్నారు. ప్రేమ, కోపం అనేక హావభావాలని లిప్టులో కేవలం హీరోహీరోయిన్‌ల మధ్యే రెండు గంటల పాటు చూపించడం అనేది కత్తిమీద సాములాంటిదేనని, ఆ ఫీట్‌ను తాము విజయవంతంగా చూపించగలిగామని నమ్మకం వ్యక్తం చేశారు. కధకు స్క్రీన్‌ప్లే బలమన్నారు.

విశ్వంవాయిస్ న్యూస్, రాజమండ్రి సిటీ:

డిఫరెంట్‌ కధతో ‘పాప్‌ కార్న్‌’

 

సాయి రొనాక్‌, అవికా కౌర్‌ జంటగా తెరకెక్కించిన ‘పాప్‌ కార్న్‌’ ఒక డిఫరెంట్‌ కధతో వస్తుందని చిత్ర దర్శకుడు మురళీ గంధం తెలిపారు. స్థానిక షల్టన్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మురళీ మాట్లాడుతూ లిఫ్టులో రెండు గంటల పాటు కేవలం హీరో, హీరోయిన్‌ల మధ్య జరిగిన సంఘటనలే పాప్‌కార్న్‌ అని తెలిపారు. పాప్‌ కార్న్‌లో ‘ఆర్‌’ను ప్రత్యేకంగా చూపించామని, ఈ ‘ఆర్‌’కి అర్ధం ఏమిటన్నది సినిమాలోనే రివీల్‌ అవుతుందన్నారు. లిప్టులోనే నాలుగు పాటలు చిత్రీకరించామన్నారు. ప్రేమ, కోపం అనేక హావభావాలని లిప్టులో కేవలం హీరోహీరోయిన్‌ల మధ్యే రెండు గంటల పాటు చూపించడం అనేది కత్తిమీద సాములాంటిదేనని, ఆ ఫీట్‌ను తాము విజయవంతంగా చూపించగలిగామని నమ్మకం వ్యక్తం చేశారు. కధకు స్క్రీన్‌ప్లే బలమన్నారు. ఫొటోగ్రఫీ నుంచి, కొరియోగ్రఫీ, డ్రెస్‌ డిజైనింగ్‌ వరకు సాంకేతిక నిపుణులు అంతా ఈ చిత్రానికి అద్భుతంగా పనిచేశారన్నారు. కోవిడ్‌ తొలి దశలో తనకు అచ్చిన ఆలోచనతో ఈ కధను తయారు చేయడం జరిగిందన్నారు. స్క్రిప్ట్‌ విన్న నిర్మాత భోగేంద్ర గుప్త కధను నమ్మి చిత్ర నిర్మాణానికి ముందుకు వచ్చారన్నారు. మరో నిర్మాత చలపతి ఎంతో సహకారం అందించారన్నారు. ఈ చిత్రం ప్రేమికుల రోజు కానుకగా ఈనెల 10న విడుదల అవుతుందని, యువతకే కాకుండా ఫ్యామీలీ ఆడియన్స్‌ను అలరించేదిగా ఉంటుందన్నారు. హీరో సాయి రొనాక్‌ మాట్లాడుతూ పాప్‌కార్న్‌ మంచి ఫీల్‌గుడ్‌ సినిమా అన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు. అవికా కౌర్‌ మాట్లాడుతూ ఈ చిత్ర కధ తనకు ఎంతో నచ్చడం వల్ల నటించడమే కాకుండా కో ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తున్నానని చెప్పారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు పాప్‌కార్న్‌ నచ్చుతుందన్నారు. నిర్మాత చలపతి మాట్లాడుతూ ఈనెల నాలుగు కింగ్‌ నాగార్జున చేతుల మీదుగా చిత్ర ట్రైలర్‌ విడుదల చశామని, ఈ చిత్రంలోని నాలుగు పాటలు ఇప్పటికే ట్రెండిరగ్‌లో ఉన్నాయన్నారు. పాప్‌కార్న్‌ను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!